దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ఆయన చేపట్టిన పాదయాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఆ పాదయాత్రలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా 'యాత్ర'. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించారు. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన 'యాత్ర' చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో..
శ్యామ్ దత్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది`` అన్నారు.
శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ - ``మా జనరేషన్‌లో వై.ఎస్.ఆర్‌గారు డైనమిక్ లీడర్. అలాంటి లీడర్‌ను మమ్ముట్టిగారు ఇండియన్ స్క్రీన్‌పై తనదైన నటనతో ఆవిష్కరించబోతున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ నా స్వంత నిర్మాణ సంస్థ..నిర్మాతలు విజయ్, శశిలు నా బ్రదర్స్. వాళ్లు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో చేసిన సినిమా. మహికి ఆల్ ది బెస్ట్. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనిక గారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు`` అన్నారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ - ``విజయ్, విష్ణు, శశి నా క్లోజ్ ఫ్రెండ్స్. వారు, నేను ఇండస్ట్రీలోకి వస్తామని అనుకోలేదు. ఇప్పుడు అందరం బయోపిక్స్ చేస్తున్నాం. నేను పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్నాను. విష్ణు యన్.టి.ఆర్ బయోపిక్ చేశాడు. ఇప్పుడు విజయ్, శశి వై.ఎస్.ఆర్‌గారి బయోపిక్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక ఇన్‌స్పిరేషనల్ మూవీ. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వై.ఎస్.ఆర్ ఫ్యాన్స్‌కే కాదు.. ఇతర ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అన్నీ రాజకీయ పార్టీలు కూడా ఈ సినిమాను చూడొచ్చు. సాధారణంగా చాలా మంది నిర్మాతలకు సినిమా అంటే పిచ్చి ఉంటుంది. కానీ కొంత మందికి మాత్రమే పిచ్చితో పాటు అవగాహన ఉంటుంది. అలాంటి కొంత మందిలో విజయ్, శశి ఉంటారు. వారు చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. మమ్ముట్టిగారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు`` అన్నారు.
ఆశ్రిత మాట్లాడుతూ - ``విజయమ్మగా మీ ముందుకు వచ్చానంటే బ్రిలియంట్ టీం వర్క్ కారణం. అందుకు మహిగారికి, నిర్మాతలకు థాంక్స్. మమ్ముట్టిగారితో నటించడం చాలా గర్వంగా, గొప్పగా భావిస్తున్నాను. నా సినీ యాత్ర ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది.. ఈ యాత్రలో భాగం కావడం ఆనందంగా ఉంది`` అన్నారు.
యలమంచిలి రవి మాట్లాడుతూ - ``లక్షలాది మందికి ఆరాధ్య దైవం అయిన వై.ఎస్.ఆర్‌గారి మీద బయోపిక్ చేయడం అనేది మహిగారికి, నిర్మాతలు శశి, విజయ్‌గారికి దక్కిన అదృష్టం అనుకోవాలి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఎదురుచూస్తున్నాం. మమ్ముట్టిగారు వై.ఎస్‌గారిగా నటిస్తున్నారని తెలియగానే సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఫిబ్రవరి 8 కోసం ఎదురుచూస్తున్నాం`` అన్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ - ఒక మహనేత కథను ఓ మహానటుడు చేయడం.. అది కూడా మా మహి డైరెక్ట్ చేయడం గొప్ప విషయం. మహి నాకు 8 ఏళ్లుగా తెలుసు. తన మూడో సినిమాకే ఇలాంటి సినిమా చేయడం.. అది కూడా మమ్ముట్టిగారిని డైరెక్ట్ చేయడం గొప్ప విషయం. మహికి ఇదొక గొప్ప లెర్నింగ్ ప్రాసెస్ అని భావిస్తున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినందిస్తున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కె మాట్లాడుతూ - ``యాత్ర` సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధిస్తుంది`` అన్నారు.
నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ - ``ఒక వారం రోజులుగా నా స్నేహితుడు శశి యు.ఎస్‌లో సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. శ్యామ్ దత్‌గారి వల్లే ఈ సినిమా చేస్తున్నాం. ఆయనే ఈ సినిమా కథను మమ్ముట్టిగారి వద్దకు తీసుకెళ్లారు. మమ్ముట్టిగారు మా కథను నమ్మడమే కాదు.. గొప్ప సహకారం అందించారు. అందుకు ఆయనకు థాంక్స్. మా సినిమాటోగ్రాఫర్ సత్య, మ్యూజిక్ డైరెక్టర్ కె, ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణగారు, మోనికగారు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌గారు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. సీతారామశాస్త్రిగారు ఐదు పాటలను ఐదు సిచ్యువేషన్స్‌కు తగ్గట్టు రాశారు. పెంచలదాస్‌గారికి థాంక్స్. డైరెక్టర్ మహి మంచి మనసున్న వ్యక్తి. . ఫిబ్రవరి 8న సినిమా విడుదలవుతుంది. వై.ఎస్.ఆర్‌గారి ఫ్యాన్స్‌కే కాదు.. ప్రతి కుటుంబం సినిమా చూసి వై.ఎస్.ఆర్‌గారి ఆత్మ, స్ఫూర్తిని ఈ సినిమాలో చూడొచ్చు`` అన్నారు.
మహి.వి.రాఘవ్ మాట్లాడుతూ - ``మమ్ముట్టిగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాలో చూసిన యాక్టింగ్ అంతా ఆయన గొప్పతనమే. ఆయనతో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. ఓ మెంటర్‌లా నన్ను నడిపించారు. ఓ సినిమా అనేది మొత్తం టీమ్‌కు సంబంధించిన వర్క్. కథ మాత్రమే నాది. అక్కడి నుండి సినిమాగా రూపొందే క్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎందరో సహకారం అందించారు. అందుకని ఈ సినిమా నాది అని చెప్పుకోను. సత్య గొప్ప విజువల్స్ అందించారు. కె గారు గొప్ప సంగీతం అందించారు. ఆర్ట్ డైరెక్షర్స్ రామకృష్ణ, మోనికగారు సపోర్ట్ చేశారు. నేను చాలా హ్యాపీగా సినిమా చేశాను. నాకు సహకరించిన నా టీంకు థాంక్స్. నేను నిర్మాతగా కెరీర్‌ను అనుకోకుండా స్టార్ట్ చేశాను. నేను డైరెక్టర్‌గా మారడానికి కారణం విజయ్, శశియే కారణం. ఇక సినిమా విషయానికి వస్తే.. నాకు, వై.ఎస్.ఆర్‌గారికి ఏ సంబంధం లేదు. ఇలాంటి కథలను ఎందరో ఎన్నో రకాలుగా చెప్పి ఉండొచ్చు. అలాంటి కథలను వినడం వల్లనే నేను రాజశేఖర్‌రెడ్డిగారి కథ చేద్దామని అనుకున్నాను. మా అమ్మగారిది కడప దగ్గర చిన్న ఊరు. అక్కడ పుట్టడం వల్ల మాకు నొప్ప ఓర్చుకునే బలం, ఓపిక మరొకరికి ఉండదు. అది మంచితనమో, మూర్ఖత్వమో అనుకోండి. జగనన్న గురించి ఓ విషయం చెప్పాలి. నేను ఎక్కడికైనా దూకిన తర్వాత ఆలోచిద్దాంలే అనుకునే టైప్. స్క్రిప్ట్ అంతా రాసేశాను. మమ్ముట్టిగారు రెడీ అయిపోయారు. నేను గోదావరి జిల్లాలో జగన్ అన్నను కలిసి ఇలా నేను పాదయాత్రపై సినిమా చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను. మా నాయన ఏం చేశాడో చూపించు, ఆయన చేయని దానికి క్రెడిట్ ఆపాదించొద్దు అన్నారు. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత ట్రైలర్ చూడమంటే చూసి బావుందన్నారు. సినిమా చూస్తారా? అన్న.. అన్నాను. ``మీ నాయకుడు కథ మీరు చెప్పారు నన్నేం చేయమంటారు`` అన్నారే కానీ.. మా నాన్న కథ అని అనలేదు. అది ఆయన గొప్పతనం. ఎవరినైనా స్పెషల్ గెస్ట్‌లను పిలుద్దామా అని అనుకున్నాం కానీ.. ఆయన అభిమానులను పిలవాలని నిర్ణయించుకున్నాం. ఇది అందరి సినిమా. ఎమోషనల్‌గా, హానెస్ట్‌గా ఉండే సినిమా. చూసినప్పుడు రియల్‌గా ఫీల్ అవుతారు`` అన్నారు.
మమ్ముట్టి మాట్లాడుతూ - ``నేను తెలుగు మాట్లాడలేను. కానీ అర్థం చేసుకుంటాను. కానీ సినిమా కోసం కష్టపడి నేర్చుకున్నాను. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను పిలుస్తారు. కవితాత్మకమైన భాష. ఇలాంటి సినిమా చేసిన ప్రతి ఒక నటీనటులకు, సాంకేతిక నిపుణుడికి థాంక్స్. నాతో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్న రా స్నేహితుడు శ్యామ్ దత్ ఈ సినిమా కథ గురించి చెప్పారు. సరేనని కథ విన్నాను. 21 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా చేయడానికి చాలా ఎగ్జయిట్ అయ్యాను. రాజశేఖర్ రెడ్డిగారి జీవితంలో చేసిన పాదయాత్ర అనే ఘటనకు సంబంధించిన కథ. ఆయన స్ర్కిప్ట్ తో కన్విన్స్ అయ్యాను. సినిమా ప్రారంభానికి ముందుగానే డైలాగ్స్ తీసుకుని నేర్చుకుని చేశాను. తప్పులున్నా కరెక్ట్ చేసుకుని నటించాను. తెలుగులో నేను నటించిన మూడో స్ట్రయిట్ తెలుగు మూవీ. ఎంతో మంది వై.ఎస్.ఆర్‌గారిని వారి గుండెల్లోపెట్టుకుని ఉన్నారు. అలాంటి వారిని గుండెల్లో నన్ను కూడా కాస్త పెట్టుకుంటారని భావిస్తున్నాను. ఆయన్ను ప్రేమించిన దానిలో నన్ను 1 శాతం ప్రేమిస్తే చాలు. మేం చేయాల్సిన పని పూర్తయ్యింది. ఇక ప్రేక్షకులే సినిమాను పెద్ద హిట్ చేయాలి`` అన్నారు.