
24 February 2016
Hyderabad
తెలంగాణా రాష్ట్రంలో సమ్మక్క-సారలమ్మ జాతర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జాతర చాలా ప్రసిద్దమైనవి. రెండు ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ జాతరలలో “జయమ్ము నిశ్చయమ్మురా” పోస్టర్ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ జాతర్లకు వెళ్తున్న దారి కూడళ్ళలో ఈ సినిమా పోస్టర్లు ఇక్కడికి వచ్చే భక్తులకు దారి చూపిస్తూ అందరినీ విశేషంగా ఆకర్షించాయి.
రెండు రాస్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉన్న కాలంలో కరీంనగర్, కాకినాడల నేపధ్యంలో జరిగే హాస్య ప్రధాన ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా”
ఈ చిత్రం పోస్టర్ ను ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నితిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో, శ్రీనివాస్ రెడ్డి - పూర్ణ హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది.





