20 April 2015
Hyderabad
జనసేన అధినేత , పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను కలసిన 'శ్రీజ'
తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఓదార్పుతో తిరిగి కోలుకున్న 'శ్రీజ' తన తల్లిదండ్రులు నాగయ్య,నాగమణి సోదరి షర్మిల శ్రీ లతో కలసి ఈ రోజు (సోమవారం) ఉదయం తన అభిమాన నటుడు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'ను ఆయన కార్యాలయంలో కలిశారు.
దాదాపు రెండుగంటల సమయం 'పవన్ కళ్యాణ్' శ్రీజ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ గడిపారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాట్లాడుతూ..' శ్రీజ పూర్తి ఆరోగ్యవంతురాలు కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీజ కు వైద్యం చేసిన డాక్టర్ 'అసాదారణ్' కు కృతఙ్ఞతలు తెలిపారు. 'శ్రీజ' కుటుంబ సభ్యులు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను కలవటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.