
24 October, 2019
Hyderabad
హీరోగా పలు వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నేచురల్ స్టార్ నాని. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో భాగంగా వాల్‌పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంలోనే `అ!` వంటి డిఫరెంట్ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందించి నిర్మాతగా సక్సెస్‌ను సాధించారు. గురువారంనాడు హైదరాబాద్‌లో వాల్‌పోస్టర్ సినిమా ప్రొడక్షన్ నెం.2గా కొత్త చిత్రం `హిట్` పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రీసెంట్గా విడుదలైన `ఫలక్‌నుమాదాస్`తో హీరోగా ప్రూవ్ చేసుకున్నవిశ్వక్ సేన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.




